ప్రజాశక్తి- చిత్తూరు, చిత్తూరు అర్బన్ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తతంగా, సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంప్రదింపుల సమూహం శాస్త్రవేత్తల బందం సభ్యులు నేడు సోమవారం గుడుపల్లి మండలంలోని గోకర్లపల్లి, సిగలపల్లి గ్రామాలలో, బంగారుపాళ్యం మండలంలోని కల్లూరిపల్లి గ్రామాలలో పర్యటించి సేంద్రియ సాగు పద్ధతులపై క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం రైతులతో ముఖాముఖి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతుసాధికార సంస్థ ‘ఆంధ్రప్రదేశ్ ప్రజాభాగస్వామ్య ప్రకతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) ప్రాజెక్టు పేరుతో అమలుచేస్తున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలు ప్రపంచం దష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో లావోస్ పీడీఆర్, భారత్, కెన్యా, జింబాబ్వే, సెనెగల్, బుర్కినా ఫావో, ట్యునీషియా, పెరూ మొత్తం 8దేశాలకు చెందిన 60మందితో కూడిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు కలరు. ఈ పర్యటనలో భాగంగా బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లిలో మహిళా రైతులు ఉమా, అంబికా గాంధీ, రైతు జ్ఞానశేఖర్ ప్రకతి వ్యవసాయ క్షేత్రంలో వేరుశనగ చిత్తూరు కంటెంజెన్సీ, మిశ్రమ పంటలు ఎ గ్రేడ్, అన్ని రకాల ఆకుకూరలు సాగు పద్ధతులను వివరించారు.ముఖాముఖిలోభాగంగా.. మహిళా రైతు ఉమా మాట్లాడుతూ.. సేంద్రీయ సాగు ఎంతో లాభదాయకమని ఆరోగ్యకరమని తెలిపారు. రైతు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తనకు గల 20 ఎకరాలలో సేంద్రియ సాగులో వరి, మామిడి, చెరకు, వేరుశనగ, మిల్లెట్స్ సాగు చేస్తున్నామని, ప్రజలు ప్రకతి వ్యవసాయము ద్వారా పండించే పంటలను ప్రోత్సాహించాలన్నారు. రైతు గౌతమ్ మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం బెంగుళూరు చేస్తూ కల్లూరులో మాకు గల 6 ఎకరాలలో మామిడి, మిర్చి, వేరుశనగ, వరి పంటల సాగు చేస్తున్నానని, ప్రకతి వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన పెంచాలని,ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ను అభివద్ధి చేయాలని తెలిపారు. బంద సభ్యులు మాట్లాడుతూ భూమితో మీకు ఉన్న అనుబంధం గొప్పదని, మీరు పండించే పంటలను ఎంతో ఇష్టంతో సాగు చేస్తున్నారని, ఇక్కడ చేస్తున్న సాగు పద్ధతులు మా దేశాలలో సాగు పద్ధతులు ను పాటించేలా చూస్తామని తెలిపారు. జిల్లాలో పర్యటించే బందంలో విందారు దిమోనియో, మారియా క్లాడియా క్రిప్టాన్, షాలిని రామిరెజ్, మాన్యువల్ నర్జస్, మారియా కరోలినా, వాటిజ్ రోజాస్, అలెజాండ్రా, అలెజాండ్రా వరగాస్ మాడ్రిడ్, కెవిన్ ఒన్యాంగో, సుదర్శన్ మలైయప్పన్, గోపాల్ కుమార్, సిల్వియా వ్యానిరా, తొరై జిగ్వేనా, మార్సెలాబెల్ట్రాన్, సిమోన్ సైగర్ రివాస్, అర్వెన్సెలీ, రాక్సా సోక్, అరిలియా మాంజెల్లా ఎన్జీవా, ఆరిలియా మాంజిల్లా ఎన్జీ వానదియా బెర్గామిని గుల్షన్ బోరాలు ఉంటారు. ఈ పర్యటనలో రైతు సాధికార సంస్థ సీఈఓ రామారావు, మోడల్ మండల్ తిమాటిక్ లీడ్ రాము, జిల్లా వ్యవసాయ అధికారి మురళీ కష్ణ, డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం జి.వాసు, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.