కలెక్టరేట్ ఎదుట కార్మికుల దీక్షలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ సహకార విజయ డెయిరీ కార్మికులు కలెక్టర్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 76వ రోజుకు చేరింది. 76 రోజులుగా తమ న్యాయమైన కోరిక సాధన కోసం రిలే దీక్షలు చేపడుతున్నా జిల్లా అధికార యంత్రంగం, రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించి వేతన బకాయిలు చెల్లించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.