ప్రజాశక్తి – శ్రీశైలం : కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఎపి టూరిజం శాఖ మంత్రి ఆర్కె.రోజా, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో మంత్రి రోజా సెల్వమణి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు ఉన్నారు. వారు విడివిడిగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ప్రసాదాలను, జ్ఞాపకను దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు అందజేశారు