‘కాథల్‌-ది కోర్‌’ ఈ ఏడాది ఉత్తమ చిత్రం : సమంత

Nov 27,2023 19:43 #New Movies Updates

‘కాథల్‌-ది కోర్‌” అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం. అందరూ చూడాల్సిన శక్తిమంతమైన సినిమా. మమ్ముట్టి నా హీరో. ఇందులో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫీల్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లవ్యూ జ్యోతిక’ అని పోస్ట్‌ చేశారు హీరోయిన్‌ సమంత. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు.. తాను చూసిన చిత్రాల రివ్యూలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘కాథల్‌. అలాగే ఈ చిత్ర దర్శకుడు జీయోబాబీని లెజెండ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సమంత పోస్ట్‌పై ‘కాథల్‌-ది కోర్‌’ నిర్మాణ సంస్థ స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరుపై ఈ సినిమాలో చూపించారు.

తాజా వార్తలు

➡️