ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు
ఎస్ఇ కార్యాలయం ముట్టడి
ప్రజాశక్తి -నెల్లూరు :
మనుబోలు మండలం, వీరంపల్లి సబ్ స్టేషన్ ఆపరే టర్ భానుచందర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల జెఎసి ఆధ్వ ర్యంలో సోమవారం నగరంలోని దర్గామిట్ట విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నారు.ఈ సందర్భంగా గిరిజన నేతలు పోలీ సుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘ నాయకులు కెసి పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.