ఓ డైరెక్టర్‌ వేధించారు : షకీల

Nov 27,2023 19:36 #movies

‘విచిత్ర నా స్నేహితురాలు. మేమిద్దరం కొన్ని సినిమాల్లో కలిసి నటించాం కూడా! ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి వల్ల ఇండిస్టీని వదిలేయాల్సి వచ్చిందనేది చెప్తే బాగుండేది. అతడి పేరు బయటపెట్టి ఉండాల్సింది. గతంలో నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో హీరో అల్లరి నరేష్‌ తండ్రి నన్ను అడ్జస్ట్‌మెంట్‌ అడిగాడు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. టాలీవుడ్‌లోని ఓ స్టార్‌ హీరో వేధింపుల వల్లే సినిమాలే వదిలేశానంటూ ఇటీవల నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన ప్రవర్తన వల్ల ఇండిస్టీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా షకీల…విచిత్రకు మద్దతు తెలుపుతూ తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది.

➡️