అజీజ్‌దుర్మార్గ పాలన పై పోరాడుదాం

Nov 27,2023 19:27
మాట్లాడుతున్న నెల్లూరుపార్లమెంటు టిడిపి అధ్యక్షుడు అబ్దుల్‌

మాట్లాడుతున్న నెల్లూరుపార్లమెంటు టిడిపి అధ్యక్షుడు అబ్దుల్‌
అజీజ్‌దుర్మార్గ పాలన పై పోరాడుదాం
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:
సమాజం మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చామని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఇతరులను కాపాడాలని నెల్లూరుపార్లమెంటు టిడిపి అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్‌ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి లతో కలిసి ఆయన సోమవారం జిల్లా టిడిపి ఎస్‌సి నేతలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు డిసెంబర్‌ 1 జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగు దళిత శంఖారావం కార్యక్రమం పై నేతలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సూచనలు చేశారు.అనంతరం అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వచ్చామన్నారు.మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడాలన్నారు.వ్యాపారాలు ఉద్యోగాలు పక్కనపెట్టి రాజకీయాల్లో కష్టపడుతున్నామని మనం చేసే కష్టం సమాజానికి దక్కుతుందన్నారు. మనం చేసే రాజకీయాలు మన సమాజానికి పనికి రానప్పుడు రాజకీయాల్లో కొనసాగటం వ్యర్థమన్నారు. చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అన్యాయం చేసి, ప్రజలకు న్యాయం చేసినట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తుందన్నారు.వైసిపి అనైతిక చర్యలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాక్షస ప్రభుత్వం పై పోరాడి టిడిపిని అధికారంలోకి తీసుకురాటానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు.కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, నెల్లూరు పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కాకి ప్రసాద్‌, నెల్లూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, టిడిపి జిల్లా కార్యదర్శి కనపర్తి గంగాధర్‌, జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధి శైలేంద్ర బాబు, మాతంగి కష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️