హైదరాబాద్ : రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ రాపిడో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పోలింగ్ రోజు(నవంబర్ 30)న హైదరాబాద్ నగరంలోని 2,600 పోలింగ్ స్టేషన్‌లకు ఉచిత రైడ్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ రవాణా గురించి ఆందోళన చెందకుండా ఓటు వేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నికల రోజున ఉచిత బైక్ రైడ్‌లను సులభతరం చేయడం ద్వారా, పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని భావిస్తున్నాన్నమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రజాస్వామ్య పండుగలో చాలా మంది చురుగ్గా పాల్గొనగలరని భావిస్తున్నట్లు తెలిపారు.