భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు

Nov 27,2023 13:15 #khalistan, #newyork

 వాషింగ్టన్‌ :   అమెరికాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధుని అడ్డుకున్నారు. సోమవారం గురునానక్‌ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌లో ఉన్న హిక్స్‌విల్లే గురుద్వారాలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తరణ్‌జిత్‌ సింగ్‌ ప్రసంగిస్తుండగా.. ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఖలిస్థానీ నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ , గురుపత్వంత్‌ సింగ్‌కు మద్దతుగా నిరసన చేపట్టారు. గురుద్వారా బయట భారీ ప్రదర్శన చేపట్టారు. దీంతో తరణ్‌జిత్‌ మధ్యలోనే ఆ కార్యక్రమం నుండి వెళ్లి పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రెండు నెలల క్రితం బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామిని గ్లాస్గోలోని గురుద్వారాలోకి వెళ్లనీయకుండా ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. కెనడాలో ఖలిస్థానీ నేత హర్‌ దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే.

➡️