ఐఎంఎ చోడవరం శాఖకు 2 అవార్డులు

అవార్డు స్వీకరిస్తున్న డాక్టర్‌ బండారు సత్యనారాయణ

ప్రజాశక్తి-చోడవరం

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) చోడవరం శాఖను రెండు అవార్డులు వరించాయి. వీటిని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ చేతుల మీదుగా చోడవరం శాఖ అధ్యక్షులు బండారు సత్యనారాయణకు విజయవాడలో అందించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ చోడవరంలో గతంలో పర్యటించింది. ఈ సందర్భంగా చోడవరం శాఖ చేస్తున్న కార్యక్రమాలు, విధివిధానాలను గుర్తించి ప్రశంసించింది. జగనన్న వైద్య సురక్ష కార్యక్రమంలో చోడవరం అసోసియేషన్‌ డాక్టర్‌ బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో శిబిరాల్లో పర్యవేక్షణతో పాటు సేవలందించారు. వీటిని గుర్తించిన ప్రభుత్వం అవార్డును అందించింది. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మాట్లాడుతూ చోడవరం డాక్టర్ల సమిష్టి కృషితో ఈ గౌరవం దక్కిందని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

➡️