సిఐటియు నేతల గృహ నిర్బంధం

సిఐటియు రంపచోడవరం జిల్లా నాయకులు రామరాజుకు నోటీసు ఇస్తున్న పోలీసు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు : రామరాజు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

కేంద్ర కార్మిక, రైతు సంఘాల పిలుపు మేరకు ఈనెల 27, 28 తేదీల్లో అమరావతిలో చేపడుతున్న మహాధర్నాకు బయలుదేరుతున్న సిఐటియు జిల్లా నాయకులు పి.రామరాజు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు కె.వెంకటలక్ష్మి, మండల నాయకులు చిన్ని కుమారి తదితరులను పోలీసులు ఆదివారం రాత్రి నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. మహాధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని, నాయకులు వెళ్లరాదని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై శాంతియుతంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న కార్మికులపై పోలీసులు నిర్బంధం ప్రయోగించడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరని రామరాజు స్పష్టం చేశారు. నిర్బంధం దుర్మార్గం : సిఐటియు నేత వెంకట్‌రంపచోడవరం : శాంతియుత ఆందోళనకు బయలుదేరిన సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ప్రజా ఉద్యమాలపై నిర్బంధం తగదు : ఉమా, చిన్నయ్యపడాల్‌అరకులోయ రూరల్‌ : మహాధర్నా కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాడేరు, పెదబయలు, అరకు ప్రాంతాల్లో సిఐటియు నాయకులను గృహ నిర్బంధాలు చేయడం తగదని సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్బి పోతురాజు, జి.భగత్‌ రాం తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా మహా ధర్నా జరుగుతోందని, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, దీనిని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుందని, కార్మికులు విజయవాడ రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.చింతపల్లి: విజయవాడలో కార్మిక కర్షక రైతుల మహా ధర్నాకు వెళ్లనివ్వకుండా కార్మిక సంఘాల నాయకులను గృహ నిర్బంధాలు చేయడం తగదని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్‌ మండిపడ్డారు. చింతపల్లి మండలం లంబసింగి గ్రామంలో ఆదివారం సిఐటియు జికె వీధి మండల కార్యదర్శి సత్యనారాయణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను హక్కులను తుంగలోకి తొక్కుతుంటే కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచి వేస్తోందని మండిపడ్డారు. 11 మండలాలలో సిఐటియు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేసినా, ఇళ్లకు పోలీసులను పంపించి నిర్బంధించినా వారి నుంచి తప్పించుకొని మహాధర్నాకు వెళ్లళ్లినట్లు తెలిపారు.

➡️