వినుకొండ: పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విను కొండ పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు. మాచర్ల నియోజక వర్గం కారం పూడి మం డలం పేటసన్ని గండ్లలో అక్రమ మైనింగ్ సందర్శిం చేందుకు జివి ఆంజనేయులు వెళ్తున్నారని వినకొండ పోలీసులు ముందస్తు నోటీ సులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాదులోని తన నివాసంలో జరిగే పూజా కార్య క్రమాలకు జీవీ ఆంజ నేయులు వెళుతుండగా మైనింగ్ వద్దకు వెళ్తున్నారని భావించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆంజనేయులు నివాసం చుట్టూ పోలీసులు మోహరించారు. అక్రమమైనింగ్‌కు పాల్పడుతున్న పిన్నెల్లి సోదరులు అక్రమ మైనింగ్ సందర్శనకు వెళ్తున్నామని పోలీసులు ఆదివారం ఉదయం తన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహ రించి గృహనిర్బంధం చేయడం దుర్మార్గ మని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వినుకొండలోని ఆయన నివాసంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంజనేయులు మాట్లా డుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాదులోని తన ఇంట్లో జరిగే పూజా కార్యక్రమానికి బయలుదేరి వెళుతుండగా పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారని చెప్పారు. తాను హైదరాబాదు వెళ్లాలని పోలీసులకు విన్న వించిన పట్టించుకోకుండా గృహనిర్బంధం చేశారని అన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించారని, దీనిపై పల్నాడు జిల్లా పోలీసులపై చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని జీవి ఆంజనేయులు తెలి పారు. మాచర్ల టిడిపి ఇన్‌ఛార్జి బ్రహ్మానందరెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేయడం చట్ట విరుద్ధమన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని కారం పూడి మండలం పేట సనిగండ్ల వద్ద కోట్లు విలువ చేసే ఖనిజాన్ని అక్రమంగా ఎమ్మెల్యే పిన్నెల్లి బ్రదర్స్ యధేశ్చగా దోచు కుంటుంటే అరికట్టాల్సిన అధికార యంత్రాంగం దోపిడీదారులకు కాపలా కాస్తోదని ఆరోపించారు. దేవాదాయ భూముల్లో ఉన్న ఖనిజ సంపద మైనింగ్ను అక్రమంగా వేల ట్రక్కులు నిత్యం తరలిస్తుంటే అరికట్టడం చేతగాని పోలీస్ అధికారులు గృహనిర్బంధాలకు పాల్ప డటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఆదా యానికి గండికొడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తు యధేశ్చగా అక్రమ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే అరికట్టాల్సిన సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిం చారు. అక్రమ మైనింగ్ దోపిడీలో సీఎంకు వాటాలు అందుతున్నాయి కనుకనే మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దొంగ ఓట్ల చేర్పులకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. అన్యాయంగా అక్రమంగా ప్రలోభాలకు లోనై కేసులు బనాయించే వారిని ఎవరిని ప్రజలు వదలని స్పష్టం చేశారు. పేట సన్నిగండ్ల దేవాదాయ భూముల్లో కోట్లు విలువ చేసే ఖనిజం మైనింగ్ అక్రమ దోపిడీపై టిడిపి సం దర్శన చేసి న్యాయ పోరాటం చేస్తుం దని స్పష్టం చేశారు. పిడుగురాళ్ల: మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం పేట సన్నగండ్ల గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ మైనింగ్ నిర్వహించి అక్కడ దొరికే బాక్సైట్ ను విదేశాలకు తరలించి వందల కోట్లు సంపాదిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆరో పించారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ విషయంపై ప్రశ్నించినందుకే తమను మైనింగ్ జరిగే ప్రాంతం వద్ద పరిశీలనకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారని తెలి పారు. అక్రమ మైనింగ్ పై పరిశీలన చేసి ప్రజలకు తెలిపే హక్కు లేదా అని ప్రశ్నిం చారు. గురజాల,మాచర్ల నియోజక వర్గాల్లో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా సాగు తోందని, తెలంగాణ మద్యం నాసి రకం మద్యం ఇసుక దందా పేకాట క్లబ్‌ల నిర్వహణ, తమ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం వంటి అక్రమాలు జరుగు తున్నాయని అన్నారు.