భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని పలువురు పిలుపు ఇచ్చారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సభలూ, సమావేశాలూ నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం భారత రాజ్యాంగాఇన్న పరిరక్షించుకోవాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు పిలుపు ఇచ్చారు. పామర్రు హైస్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నేడు పాలకులు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, రాజ్యాంగ విలువలను రాజకీయ నాయకులు అమలు చేయడం లేదన్నారు. రాజ్యాంగ విలువలను అందరం కాపాడినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వి.గోపాలరావు, సిఐటియు నాయకులు ఎన్.బలరాం, సిపిఐ నాయకులు పి.రాములు పూల మాలలు వేసి నివాళులర్పించారు. వై.రామరాజు, కార్మికులు పాల్గొన్నారు. ఎంపిపి అంబటి భవాని, ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ, నెహ్రూ, రాంబాబు, డాక్టర్ పివివి.సత్యనారాయణ, చొప్పెల్ల వెంకన్నబాబు, రేవు నాగేశ్వరరావు, గుబ్బల శ్రీను, రామకష్ణ నివాళులర్పించారు. అమలాపురం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థుల చేత భారత రాజ్యాంగ ప్రవేశిక అంశాలరy ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెసి నుపుర్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. రాజ్యాంగం విలువలను నిలబెట్టడానికి పౌరులందరూ కృషి చేయాలని జెసి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్.సత్తిబాబు, ఆర్‌డిఒ జి.కేశవవర్ధన్ రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ జెడి పి.జ్యోతిలక్ష్మిదేవి, డిఇఒ కమల కుమారి, కలెక్టరేట్ ఎఒ కె.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అల్లవరం మండలం గోడి పంచాయతీలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్ రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడారు. స్థానిక సర్పంచ్ తోట శ్రీదేవి, పంచాయతీ సెక్రెటరీ రవిరాజ్, తోట నరసింహారావు పాల్గొన్నారు. మండపేట ఏడిదలో సర్పంచ్ బురిగ ఆశీర్వాదం, వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిలుకూరి బుజ్జి, పైడిమళ్ల పెద్దబ్బులు, రామిశెట్టి శ్రీహరిబాబు, కురుపుడి రాంబాబు, వల్లూరి రామకృష్ణ, పలివెల సుధాకర్, బూరిగ జానీ, తేలు శీను, విసుపురెడ్డి శివ, పరమటి తరుణ్, పైడిమల్ రాజు, తాతపూడి రాజు పాల్గొన్నారు. అయినవిల్లి ముక్తేశ్వరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బడుగు భాస్కర్ జోగేష్ రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషిని వివరించారు. గిడ్ల వెంకటేశ్వర రావు, మద్దా చంటిబాబు, సరెళ్ల సత్యనారాయణ, వస్కా శ్యామ్‌సుందర్, బొక్కా రామచంద్రరావు, గుమ్మళ్ల సాగర్, కుంచే చంద్రకాంతుడు, మోర్త సత్తిబాబు, కుసుమ బహుగుణ, మెల్లం సత్యనారాయణ, కోరపు మురళి, బడుగు వెంకటేష్, పరమట నాని, బడుగు అగ్ని పాల్గొన్నారు. ఆలమూరు చెముడులంకలో వెటర్నరీ అసిస్టెంట్ బడుగు సురేంద్ర, వస్కా ముసలయ్య, బద్ద బాలరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిఎస్‌పి కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రపు కొత్తియ్య, నేతలు అవినాష్, వీర ప్రతాప్, ఈశ్వర్, సుకుమార్ పాల్గొన్నారు. కాట్రేనికోన సర్పంచులు గంటి వెంకట సుధాకర్, సలగల అప్పారావు, నల్ల నరసింహమూర్తి దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తం ఎన్.కొత్తపల్లిలో మాల మహానాడు మండల కన్వీనర్ కొంకి వెంకట బాబ్జి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ కుంచే చిట్టికుమారి, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుంచే చిన్ని, కొంకి బాలకృష్ణ, రాజారావు, నందిక రమేష్, కొండేపూడి నరసింహమూర్తి, సాధనాల సురేంద్ర, గోసంగి శ్రీనివాసరావు, నేరేడుమిల్లి రాజు, నూకపెయ్యి ధనబాబు పాల్గొన్నారు. అంబాజీపేట అమలాపురం స్పెషల్ కోర్టు న్యాయమూర్తి పులిదిండి వెంకట ప్రసాదరావు పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యాన బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన దినోత్సవంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నక్కా బాస్కర్, వాసంశెట్టి చినబాబు, డివివి.సత్యనారాయణ, పివి.సత్యనారాయణ, మహ్మద్ ఆరిఫ్, నెల్లి వెంకటరమణ, ఎ.నారాయణమూర్తి, అరిగెల బలరామూర్తి, గోసంగి సత్యనారాయణ, నూకపెయ్యి చిన్న, పత్తి దత్తుడు, సుంకర నాయుడు, చింతపల్లి వెంకటేశ్వరరావు, బీర సురేష్, కోట సత్తిబాబు, ఉందుర్తి నాగబాబు, మైలే ఆనందరావు, మట్టా వెంకటేశ్వ రరావు, నాగవరపు అన్నవరం, కత్తుల బాబులు, సత్యాల కొండలరావు, శశి పాల్గొన్నారు. ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ రహంతుల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు, విధులు పట్ల పౌరులంతా అవగాహనతో మెలగాలని సూచించారు. సీనియర్ అడ్వకేట్ దోనిపాటి ఆంజనేయులు, బీర ప్రసాద్‌బాబు, దాసరి సత్యనారాయణ, పివివి.సత్యనారాయణ, కాశి సింహాద్రి, సిద్ధార్థ కుమార్, పోలిశెట్టి రాజేష్, అయినవిల్లి వలియా బాబా, పి.నరేష్, వడ్డి త్రిమూర్తులు, ముమ్మిడివరం ఎస్‌ఐ శివ ప్రసాద్ పాల్గొన్నారు.