విభజన హామీల అమలుకు డిమాండ్

విభజన హామీల

ప్రజాశక్తి-ముమ్మిడివరంవిభజన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యాన మహిపాల చెరువు సెంటర్‌ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోడీ తిరుపతి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ వెనక్కి పోవాలని నిరసన చేపట్టినట్టు చెప్పారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గుదే దుర్గాప్రసాద్‌, బివిడిఎన్‌.శ్రీనివాస్‌, విత్తనాల రాంబాబు, డి.సోమరాజు, పి.శ్రీను, పి.బాలాజీ, టి.శ్రీరామ్మూర్తి, సత్యనారాయణ, పండు పాల్గొన్నారు.

➡️