విద్యార్థుల హక్కుల కోసం పోరాడుదాం : ఎస్‌ఎఫ్‌ఐ

విద్యార్థుల హక్కుల కోసం పోరాడుదాం : ఎస్‌ఎఫ్‌ఐ

విద్యార్థుల హక్కుల కోసం పోరాడుదాం : ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: విద్యార్థుల సమస్యలు, అందరికీ విద్య అందే వరకు విద్యార్థులను ఐఖ్యం చేసి పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవ్‌కష్ణ పిలుపునిచ్చారు. ఎస్వీ నగర మహాసభలు యశోదనగర్‌లోని వేమనవిజ్ఞాన కేంద్రంలో జరిగాయి. మహాసభలును ఉద్దేశించి మాధవకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యరంగాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ పేద, మధ్య, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి స్మార్ట్‌ సిటీ నగరం అన్నది పేరుకే తప్ప హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు ఎక్కడికి అక్కడే ఉన్నాయాని అన్నారు. ప్రభుత్వ ఎస్వీ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులను కేవలం ఒక సంవత్సరం మాత్రమే వసతి కల్పించి, ద్వితీయ సంవత్సరం నుంచి బయటకు పంపిస్తున్నారని, బయట రూమ్‌రెంట్‌ కట్టుకోలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అలాగే మాజీ నాయకులు సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై నిస్వార్థంగా పోరాడేది దేశంలో అత్యంత పెద్దసంఘం ఎస్‌ఎఫ్‌ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భగత్‌ రవి, జిల్లా ఉపాధ్యక్షులు అక్బర్‌, అశోక్‌, నగర నాయకులు రవి, ప్రసాద్‌, శివ మల్లి తదితరులు పాల్గొన్నారు.

➡️