ప్రజాశక్తి – కడప భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, అందుకు ప్రతి భారతీయుడు తన వంతు కషి చేయాలని జిల్లా జయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం 74వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా జయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా స్పందన హాలులో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో జెసి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు భారతీయ పౌరుడిగా కషి చేయడం మన బాధ్యత అన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివద్ధి, అభ్యున్నతిని కాంక్షించి రచించిన రాజ్యాంగ గ్రంథాన్ని 26 నవంబర్ 1949న జాతికి అంకితం చేసి రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్న విషయాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే రోజును జాతీయ న్యాయ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాలను కూడా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ లతో పాటు డిప్యూటీ కలెక్టర్లు కౌసర్ భాను, ప్రత్యూష, మైనారిటీ కార్పోరేషన్ ఇడి డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మహేశ్వర్ రెడ్డి, కలెక్టరేట్ ఎఒ విజరుకుమార్, అన్ని విభాగాల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో.. ప్రభుత్వ పురుషుల కళాశాల స్వయం ప్రతిపత్తి కడప ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి రవీంద్రనాథ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వై. సావిత్రి, శివరామకష్ణ, డాక్టర్ అంకాల నాగరాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా వై సావిత్రి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి, అధ్యాపకులు, విద్యార్థులు పేర్కొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.బి. అంజాద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మాసాపేట కూడలిలో పల్లెకొండు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 74వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం(లా డే), వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శాంత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ జ్యోతి, ఫిజికల్ డైరెక్టర్ నాగమ్మ, హెడ్ ఆఫ్ ది ఫార్మసీ సెక్షన్ సుజాత, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కడప అర్బన్ : భారత ప్రజాస్వామ్య పాలానకు రాజ్యాంగ రచనలు పొందు పరచి దేశ ప్రజల ఎనలేని కీర్తి గడించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని టిడిపి జిల్లాఆధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు అన్నారు. కలెక్టరేట్ లోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. టిడిపి కడప అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి వి.ఎస్. అమీర్ బాబు కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు కొండా సుబ్బయ్య, లింగాల శివశంకర్ రెడ్డి, రాయల్ కరిముల్లా, శేషయ్య నాయుడు, నాగేంద్ర నాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షులు రహిమాన్, రమణారెడ్డి, బండారు ప్రసాద్ పాల్గొన్నారు. కలసపాడు : యోగివేమన పాలక మండల మాజీ సభ్యురాలు. ఎన్. డి. విజయ జ్యోతి ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన, కూడా అతి తక్కువ రోజుల్లో రచించిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్ దే అని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో మండల ఎస్సీ ఎస్టీ, బిసి, మండల నాయకులు పాల్గొన్నారు.