ఖానాపూర్: . కాంగ్రెస్ హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం దానిని రద్దు చేశామనితెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. ”రాష్ట్ర సంపదను పెంచి పింఛను అందిస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదు. బిఆర్‌ఎస్ పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. పదేళ్ల నుంచి బిఆర్‌ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అనేక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. 3 గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో పడేస్తామని అంటున్నారు. అదే జరిగితే ప్రజలు దెబ్బతింటారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ధరణికి దండం పెడతారు. దాంతో లంచాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలతో పాత కష్టాలు మళ్లీ మొదలవుతాయి. ” అని కేసీఆర్ కోరారు.” ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 400 మందిని కాల్చి చంపింది” అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరి పడుతుంది కేసీఆర్ హెచ్చరించారు.