ప్రజాశక్తి-రామచంద్రపుర (అంబేద్కర్ కోనసీమజిల్లా) : కే గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకట రమణ బహూకరించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వెంకటరమణ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, వైద్యులు డాక్టర్ బాబ్జి, జడ్పిటిసి ఓబులనేని వరలక్ష్మి, ఎంపీపీ పంపన నాగమణి, వైసిపి నాయకులు రేవు శ్రీను, పెట్ట శ్రీను, బత్తుల అప్పారావు, తోకల శ్రీనివాస్, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఇళ్ల సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ వాసంశెట్టి సూరిబాబు, టిడిపి నాయకులు గరికిపాటి సూర్యనారాయణ, కొమరిన వీర్రాజు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.