ప్రజాశక్తి-మండపేటసంఘ చైతన్యంతో యుటిఎఫ్ ముందుకు సాగాలని ఎంఎల్సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని తాపేశ్వరంలో పోలిశెట్టి సత్తిరాజు భూషణం ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ మండలం నూతన కౌన్సిల్ సమావేశం మైపాల త్రినాథరావు అధ్యక్షతన శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సి ఐవి మాట్లాడారు. శ్రమజీవుల పోరాటంలో యుటిఎఫ్ పాలుపంచుకుందన్నారు. యుటిఎఫ్ ఎన్నో పోరాటాలను బలపరిచిందన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం అమలు జరగడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక చట్టం కూడా తీసుకురాలేదన్నారు. ఎపిలో నాలుగు చట్టాలు అమల్లోకఇ వచ్చాయని, అసెంబ్లీ సమావేశాల్లో చర్చ లేకుండా రచ్చ జరుగుతోందన్నారు. ఆరేళ్లలో ప్రభుత్వం ఒక్క డిఎస్పి కూడా వేయలేదన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన పలువురిని సత్కరించారు. ఎంఇఒలు నాయుడు రామచంద్రరావు, శాలెం రాజు సోమిరెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డివి.రాఘవులు, నాయకులు పి.సురేంద్ర, కె.గోపాలకృష్ణారెడ్డి, తాడి శ్రీనివాస్, గొడవర్తి సుధాకర్, జి.రాజు, గంటి వీర్రాజు, సీతాదేవి, పనసయ్య, చింతపల్లి ప్రసాద్, రాజమండ్రి రమణ పాల్గొన్నారు.