‘టిడ్కో’ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి

 

సిబ్బందితో సమీక్షిస్తున్న కమిషనర్‌ రామారావు

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉప్పు వారి సత్రం జగ్గంగారిపేట టిడ్కో గృహాలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు పరిష్కరించి లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ జె. రామారావు మెప్మా సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మెప్మా కార్యాలయంలో శనివారం వెల్ఫేర్‌ సెక్రెటరీలకు, మెప్మా సిబ్బందికి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ టిడ్కో గహాల లబ్ధి దారులు అధిక వయసుతో ఉన్నా, మరణించినా వారి కుటుంబాల్లో అర్హులైన వారికి గృహాలను అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఇంకా బ్యాంకురుణాలకు సంభందించి ఇబ్బందులున్నా లబ్ధిదారుల విషయంలో తాను బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మన్నారు. కాబట్టి ఆ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇంకా జగ్గమ్మగారి పేటలో మూడు రకాల గృహాలకు సంభందించి రిజిస్ట్రేషన్‌ ఇబ్బందులున్నా, పత్రాలు అందని లబ్ధిదారులు ఉన్నా వారికి వారం రోజులు లోగా గహాల స్వాధీన పత్రాలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా పలు అంశాలపై కమిషనర్‌ సిబ్బందిని సమీక్షించారు. సమావేశంలో మెప్మా సిఎంఎం సుజాత, టిపిఒ ఫణికుమార్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

➡️