కొట్టుకుపోయిన ప్రధాన రహదారి

Nov 25,2023 23:22

ప్రజాశక్తి-రాచర్ల: మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గుడిమెట్ట నుండి దద్దవాడ వెళ్లే ప్రధాన రహదారి వర్షపునీటి ప్రవాహానికి కొట్టుకొని పో యింది. రోడ్డు వంతెన సమీపాన కాలువ వెడ ల్పు తక్కువగా ఉండటంతో నీటి ప్రవాహ ఉధతికి వంతెనతో సహా రోడ్డు కొట్టుకుపోయిం ది. దీంతో నాలుగు గ్రామాల ప్రజల రాకపోక లకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని సిపిఎం రాచర్ల మండల నాయకులు థామస్‌ సంబంధిత అధి కారులకు తెలియజేశారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తాత్కాలిక చర్యలే చేపట్టారు. కానీ వాహన రాకపోకలు కొనసాగ లేదు. త్వరలో వంతెన నిర్మాణం చేపట్టి రాకపోక లకు ముఖ్యంగా విద్యార్థుల స్కూలు బస్సుల రాకపోకలకు రోడ్డు పున:నిర్మాణం చేపట్టాలని థామస్‌ అధికారులను కోరారు.

➡️