ప్రజాశక్తి – కడప అర్బన్ సామాన్య జనంలో విభిన్న ప్రతిభావంతులు కూడా ఒక భాగమే అని గుర్తించిన భారత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల అభివద్ధి, పునరావాస సేవలతో పాటు సాధికారత కోసం పాటుపడుతోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖా మంత్రి ఎ. నారాయణ స్వామి పేర్కొన్నారు. శనివారం ‘సామాజిక్ అధికారిత షివిర్’ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 20 క్యాంపుల ద్వారా ఎడిఐపి ప్రత్యేక పథకం ద్వారా అలింకో సంస్థ సౌజన్యంతో నాణ్యమైన ఉప కరణాల పంపిణీ కార్యక్రమం జడ్పి సభాభవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావుంతులు కూడా ఒకరుగా ఉండా లనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ దేశ వ్యాప్తంగా తీసుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. 16 నెలల కిందట జిల్లాకు వచ్చినపుడు విభిన్న ప్రతిభా వంతులకు సహాయ ఉపకరణాల అవసరాన్ని గుర్తించి కలెక్టర్‌తో చర్చించినట్లు తెలిపారు. వెంటనే అం దుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టిన కలెక్టర్ ఆలింకో ప్రతినిధులతో మాట్లాడి 42 క్యాంపులు, 6509 మంది లబ్ధిదారులను గుర్తించారని పేర్కొన్నారు. ఆ మేరకు వారి వారి అవసరాలను గుర్తించి సహాయ ఉపకారణాలను అందించినట్లు చెప్పారు. జవాబుదారీ నాయకత్వాన్ని అందించిన ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, సంతప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందిస్తూ వారి జీవన విధానాన్ని వికశింపజేయాలన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు 14 వేలకు పైగా క్యాంపులు నిర్వహించి విభిన్న ప్రతిభావంతులను గుర్తించి వారికి అవసరమైన సహాయ ఉపకారణాలను అందించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందుతున్న విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మొదలైన అన్ని రకాల సాయాన్ని విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు ఏ ఒక్కరూ కూడా అసంత్తప్తిగా జీవితం గడపకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల అవసరాలను తీర్చతగిన అత్యాధునిక సహాయక పరికరాలు, పునరావాస సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వి.విజరు రామరాజు మాట్లా డుతూ అవయవ లోపాలున్న విభిన్న ప్రతిభా వంతులకు కత్రిమ అవయవ పరికరాలు, సహాయక ఉపకరణాలను అందించే బహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలోని 6,509 మంది విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ఆలింకో సంస్థ ఔధార్యం, జిల్లా ప్రత్యేక చొరవతో ఈ బహత్తర మహా కార్యంగా దిగ్విజయం అయిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి, జెసి గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆలింకో డిప్యూటీ జీఎం సంజరు సింగ్, కడప ఆర్‌డిఒ మధుసూదన్, ఎస్ఎస్ఎ పిఒ ప్రభాకర్ రెడ్డి, డిసేబుల్ శాఖ ఎడి కష్ణ కిషోర్, సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు.