స్వల్పకాలిక వరిరకాలతో సాగునీరు ఆదా

Nov 25,2023 21:15
ఫొటో : మాట్లాడుతున్న ఎడిఎ డి.సుజాత

ఫొటో : మాట్లాడుతున్న ఎడిఎ డి.సుజాత
స్వల్పకాలిక వరిరకాలతో సాగునీరు ఆదా
ప్రజాశక్తి-సంగం : స్వల్పకాలిక వరి రకాలను సాగు చేసుకోవడం ద్వారా సాగునీటి ఆదా చేయవచ్చని ఎడిఎ డి.సుజాత తెలిపారు. మండలంలోని జెండాదిబ్బ కేంద్రంలో సాగునీటి యాజమాన్యంపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎడిఎ సుజాత మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక వరి రకాలు లైన ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, కెఎన్‌ఎం 1638, ఎన్‌ఎల్‌ఆర్‌ 3354 ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 తదితరా రకాలు సాగు చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల 15వ తేదీ లోపు నాట్లు వేసుకుంటే పంట అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి ఎన్‌.శ్రీహరి మాట్లాడుతూ డ్రమ్స్‌ లీడర్‌ లేదా వెదజల్లే పద్ధతిలో వేస్తే పది రోజులు ముందుగానే పంట కోతకు వస్తుందని వివరించారు. కార్యక్రమంలో విఎఎ రాజేశ్వరి, గ్రామ సర్పంచి శంకరయ్య, రైతులు పాల్గొన్నారు.

➡️