ప్రజాశక్తి-గంపలగూడెం : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను ఊటుకూరు గ్రామాలకు చెందిన రైతు కౌలు రైతులు 2016 -17 సం వ్యవసాయ సీజన్లో భాగంగా నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ శాఖ జేడి ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి పగడాల.వీరాంజినేయులు మాట్లాడుతూ పెనుగొలను గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ నర్సరీ మరియు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ నర్సరీల నుండి మిర్చినారు కొనుగోలు చేసి పంట వేయగా అవి పూత పిండే రాకపోవడంతో ఆందోళన చెందిన రైతులు 2016 డిసెంబర్లో మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు అధికారులు నర్సరీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించటంతో బాధితులు 2017 జనవరి నుండి ఉద్యమం చేపట్టారు. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులకు విన్నవించుకోగా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు స్పందించి వ్యవసాయ శాస్త్రవేత్తలను గ్రామంలోని మిర్చి పంటలను పరిశీలించి పరీక్ష చేయగా నకిలీ మిర్చినారు కావడం వల్లనే పంట పండలేదని నిర్ధారించారు. నష్టపోయిన 87 మంది రైతులకు రెండు కోట్ల 13 లక్షల 29వేల 70 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నర్సరీ యజమానులకు జిల్లా స్థాయి నష్టపరిహార కమిటీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ పెనుగోలను నుండి విజయవాడకు పాదయాత్ర చేసిన సందర్భంగా అప్పటి కలెక్టర్లు, ఇతర అధికారులతో రైతులకు చర్చలు జరిపి ఎకరానికి 91,000 నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా తక్షణమే ఎకరానికి రైతులకు 35000 నష్టపరిహారం ఇచ్చేటట్లు ఒప్పందం కుదురుచుకొని దానిలో 30 వేలే ఇచ్చినారు. మిగతావి నేటికి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
కౌలు రైతుల సంఘం యన్టీఆర్ అద్యక్షుడు గువ్వల సీతారామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి నష్టపరహార కమిటీ సిఫార సు చేసిన విధంగా 87 మంది రైతులకు ఎకరానికి 91 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి, దాంట్లో రైతులకు ఇచ్చిన 30 వేల రూపాయలు ఫోను మిగతా అమౌంట్ ఇట్టిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. స్థానిక వ్యవసాయ శాఖ జెడి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతులు, B.పూర్ణ,P.భద్రం,B.గోపి కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.