ప్రజాశక్తి-పరవాడ : దేశ వ్యాప్త కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాకు వందలాదిగా కదిలి రావాలని సిఐటియు ఆధ్వర్యంలో శనివారం గోడ పోస్టర్ లంకెలపాలెం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ధరలు నియంత్రించాలని ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలపై జిఎస్టి రద్దు చేయాలన్నారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ పై ఎక్సైజ్ పనులు గణనీయంగా తగ్గించాలన్నారు రైల్వే రాయితీలు పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు ప్రజా పంపిణీ పథకాన్ని విస్తృతం చేసి ఆహార భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనం 26000 నిర్ణయించి అమలు చేయాలన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుగా నిలిపివేయాలని అన్నారు. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు స్కీం వర్కర్లకు అసంఘటితపరంగా కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని ఫార్మాసిటీలో కార్మిక చట్టాలు అమలు చేయాలని, కార్మిక చట్టాల సవరించే మోడీ విధానాలను నశించాలని కోటి అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాలు ఈ విధానాలను అనుసరించడానికి భయపడే స్థాయిలో కార్మిక, రైతులు ఐక్య పోరాటాలు పెరగాలని అన్నారు. ఈ దశలో విజయవాడలో జరిగే మహాధర్నా లోరైతులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోటి కోరారు రైతుల పోరాటాలకు తలోగ్గి రైతు వ్యతిరేక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆ సందర్భంలో కార్మికులకు కనీస వేతనం నెలకు 26000 నిర్ణయించి అమలు చేయాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ ఉప సవరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ, సిఐటియు మండల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం రమణి, సిఐటియు నాయకులు టి.సంతోష్ ఎం.సంతోష్ కుమార్, కొండలరావు, స్వాతి, కనకమ్మ, తదితరులు పాల్గొన్నారు.