ప్రజాశక్తి-విజయనగరం కోట : జెండర్ ఆధారిత హింసను విడనాడాలని డి ఆర్ డి ఎ పిడి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. శనివారం ఉదయం విజయనగరం డిఆర్డిఏ కార్యాలయం వద్ద జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ విజయనగరం సమాఖ్య, విజయనగరం జిల్లాలో నయీ చేతన్ 2.0గా కేంద్ర నామకరణంతో చేపట్టిన అవగాహన కార్యక్రమ ర్యాలీని పిడి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో చైల్డ్ ఎడ్యుకేషన్ చైల్డ్ మ్యారేజ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం సరస్, ఎస్సార్ ఎం, ఐసిడిఎస్ వి, విద్యా వైద్య విభాగాలతో వివిధ డిపార్ట్మెంట్లో కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ద డేమినేషన్ రోజుగా పాటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. ఇందులో మొదటి వారం ఈనెల 25 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జెండర్ వైలెన్స్ అరికట్టే విధానంపై అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ కార్యక్రమము, రెండవ వారం డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఇందులో బాల్య వివాహాలపైన ర్యాలీలు, కేస్ స్టడీస్ వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మూడో వారం డిసెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు రక్తహీనత పోషకాహారం, వాటిపై అవగాహన కార్యక్రమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి తెలపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నాలుగో వారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఆడపిల్లలకు వివిధ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిబ్బంది పాల్గొన్నారు.