ఆర్టీపీపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆందోళన

RTPP employees protest

ప్రజాశక్తి-వైఎస్ఆర్ జిల్లా : వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆందోళన చేపట్టారు. ఉత్పత్తికి తగ్గ సిబ్బంది ఉండాలని గత 2020 నుంచి అనేక సందర్భాల్లో వినతులు అభ్యర్థనలు చేసిన యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పీపీఏ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ డిస్కం వారు ఫిక్సిడ్ ఛార్జీల రూపంలో డాక్టర్ ఎన్.టి.టి.పీస్ మొత్తం 980.95 కోట్లు(ఓ అండ్ యంకి 696.25 కోట్లు, స్టేజ్-4కి 284.70 కోట్లు) చెల్లించాలని తెలిపారు. ఆర్టీపీపీకి మొత్తం 14.59.54కోట్లు ( స్టేజ్-1కి 264.16 కోట్లు, స్టేజ్-2కి 258.20 కోట్లు, స్టేజ్-3కి 169.18 కోట్లు, స్టేజ్-4కి 68.00కోట్లు) చెల్లించాలని పేర్కొన్నారు. సంవత్సరానికి 1459.54 కోట్లు ఫిక్సిడ్ చార్జీల రూపంలో డిస్కములు ఏపీ జెన్కోలకు చెల్లిస్తున్నారని తెలిపారు. ఆర్టీపీపీకి 90% పైగా ఉత్పత్తి చేస్తున్న యాజమాన్యం ఉత్పత్తికి తగ్గట్టు అసిస్టెంట్ ఇంజనీర్ లో నియామకాలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100కు పైగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ల పోస్టులను కుదించడం ఇంజనీర్ ల కు పని భారాన్ని ఎక్కువగా మోపడం ఇది చాలా అన్యాయం దుర్మార్గమని అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

తాజా వార్తలు

➡️