దుబ్బాక: బిజెపి నేత రఘునందన్‌రావుకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విజయభేరి యాత్రలో భాగంగా దుబ్బాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రఘునందన్‌పై విమర్శలు గుప్పించారు.”దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిని గెలిపించారు. గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకను అభివఅద్ధి చేస్తామన్నారు. కేంద్రం సహకారంలో పారిశ్రామికవాడ, ప్రాజెక్టులు తీసుకొస్తామన్నారు. మూడేళ్లు ఇయినా ఇప్పటికీ దుబ్బాక సమస్యలు తీరలేదు. ఈ ఎన్నికల్లో రఘునందర్‌రావుకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. చివరికి దుబ్బాక నిధులను మొత్తం రద్దు చేసి సిద్దిపేటకు తరలించారు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డిని గెలిపించాని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు.