తెలంగాణ పోలింగ్ అప్ డేట్స్

polling in telangana 2023

తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ జరుగుతుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 13 సమస్యత్మక  స్థానాల్లో సాయంత్రం 4 గంటలకుపోలింగ్ ముగియ‌నుంది.

                                    తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్‌ ముగిసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించారు. 4 గంటల వరకు వరుసలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. రాష్ట్రంలో మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

                                              పోలింగ్‌.. మధ్యాహ్నం 3 గంటలకు 51.89శాతం

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 70.48శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 20.09 శాతం నమోదైంది.

 మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతం

తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం నమోదయింది. వివిధ జిల్లాల్లో ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే…
అదిలాబాద్ – 41.88 శాతం,
భద్రాద్రి కొత్తగూడెం – 39.29 శాతం,
హన్మకొండ – 35.29 శాతం,
హైదరాబాద్ – 20.79 శాతం,
జగిత్యాల – 46 .14  శాతం,
జనగామ – 44.31 శాతం,
భూపాలపల్లి – 49.12 శాతం,
గద్వాల – 49.29 శాతం,
కామారెడ్డి – 40.78 శాతం,
కరీంనగర్ – 40.73 శాతం,
ఖమ్మం – 42.93 శాతం,
కుమురం భీమ్ – 42.77 శాతం,
మహబూబాబాద్ – 46.89 శాతం,
మహబూబ్ నగర్- 44.93 శాతం,
మంచిర్యాల – 42.74 శాతం,
మెదక్ – 50.80 శాతం,
మేడ్చల్ మల్కాజిగిరి – 26.70 శాతం,
ములుగు – 45.69 శాతం,
నాగర్ కర్నూలు – 39.58 శాతం,
నల్గొండ – 39.20 శాతం,
నారాయణపేట – 42.60 శాతం,
నిర్మల్ – 41.74 శాతం,
నిజామాబాద్ – 39.66 శాతం,
పెద్దపల్లి – 44.49 శాతం,
రాజన్న సిరిసిల్ల – 39.07 శాతం,
రంగారెడ్డి – 29.79 శాతం,
సంగారెడ్డి – 42.17 శాతం,
సిద్దిపేట – 44.35 శాతం,
సూర్యాపేట – 44.14 శాతం,
వికారాబాద్ – 44.85 శాతం,
వనపర్తి – 40.40 శాతం,
వరంగల్ – 37.25 శాతం,
యాదాద్రి భువనగిరి – 45.07 శాతం ఓటింగ్ నమోదయింది.

Chukaramaiah

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య

విద్యానగర్‌లోని హిందీ మహా విద్యాలయలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99 ఏళ్ల వయసులో ఆయన పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్‌ దంపతులు

చింతమడక : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ రావు స్వాగతం పలికారు. ఓటు వేసిన తర్వాత ఆయన తిరుగుపయనమయ్యారు. మరోవైపు, కేసీఆర్‌ వచ్చేంత వరకు ఓటు వేసేందుకు రాని చింతమడక ఓటర్లు.. ఆయన వచ్చే సమయానికి పోలింగ్‌ బూత్‌ కు చేరుకున్నారు. ఆయనతో కలిసి ఓటు వేసేందుకు క్యూకట్టారు.

11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎలా ఉందంటే…

అదిలాబాద్             30.6 శాతం
భద్రాద్రి                   22.05శాతం
జగిత్యాల                22.5 శాతం
హనుమకొండ          21.43శాతం
భూపాలపల్లి           27.80 శాతం
జనగాం                  23.25 శాతం
హైదరాబాద్          12.39 శాతం
కామారెడ్డి              24.70 శాతం
గద్వాల్                 29.54 శాతం
ఆసిఫాబాద్           23.68 శాతం
వరంగల్               18.73 శాతం
వనపర్తి                24.10 శాతం
యాదాద్రి            24.29 శాతం
సిద్దిపేట              28.08 శాతం
సూర్యాపేట         22.58 శాతం
రంగారెడ్డి శాతం    16.84 శాతం
వికారాబాద్           23.16 శాతం
సంగారెడ్డి            21.99 శాతం
పెద్దపల్లి             26.41 శాతం
నిజామాబాద్       21.25శాతం
సిరిసిల్ల              22.02 శాతం
నిర్మల్                25.10 శాతం
నల్గొండ             22.74 శాతం
నారాయణపేట   23.11శాతం
నాగర్ కర్నూల్   22.19 శాతం
ములుగు            25.36 శాతం
మేడ్చల్          14.74 శాతం
మంచిర్యాల్     24.38 శాతం
మెహబూబాబాద్      28.05 శాతం
మెదక్              30.27 శాతం
మహబూబ్నగర్      23.10 శాతం
మేడ్చల్          14.74 శాతంగా పోలింగ్ నమోదయింది

పోలింగ్ బహిష్కరణ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్ ను బహిష్కరించారు గిరిజన గ్రామస్తులు. తమ గ్రామం లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును గిరిజన గ్రామస్తులు భహిష్కరించారు.  వైరా నియోజకవర్గంలోని రెండు చోట్ల గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు.  ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో  రహదారులు ,త్రాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు 20 ఏళ్లుగా ఏర్పాటు చేయలేదని గిరిజనులు నిరసన తెలుపుతున్నారు. తమ సమస్య పరిష్కరించేంతవరకు ఓటు వేయమని వాళ్లు అంటుడగా.. అధికారులు మాత్రం వాళ్లను బతిమాలుతున్నారు.

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్‌ రావు

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా మంత్రి తన్నీరు హరీష్‌ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబిటస్‌ స్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌ 114లో మంత్రి హరీష్‌ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొంత మంది ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు విరుద్దంగా పరిధి దాటి మాట్లాడుతున్నారని, వారిపై ఎలక్షన్‌ కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాగార్జున సాగర్‌ విషయంలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత మాట్లాడుతా అన్నారు.

హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్

  •  ఎప్పటిలాగే హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా నాంపల్లిలో 0.5శాతం, సనత్ నగర్ 1.2శాతం, కూకట్ పల్లిలో 1.9 శాతం గా పోలింగ్ ఉంది.

ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్

హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లో కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. సతీమణి శైలిమాతో కలిసి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘బాధ్యత గల పౌరునిగా నేను ఓటు వేశాను. రాష్ట్రాన్ని ప్రగతి పతంలో నడిపించే పార్టీకి ఓటు వేశాను. పట్టణ ప్రజలు అందరూ ఓటు వేయండి’’ అని కేటీఆర్ కోరారు.

  • ఓటు హక్కును వినియోగించుకున్నప్రముఖులు

  • తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం : తెలంగాణ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు గడిచిపోయింది.. మెజారిటీ ప్రాంతాల్లో పోలింగ్ సజావుగానే సాగుతోంది.  ఉదయం 9 గంటల వరకు వివిధ జిల్లాల్లో నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది..

వరంగల్ 11శాతం
నారాయణపేట 11 శాతం
హనుమకొండ 11శాతం
సంగారెడ్డి 12 శాతం
యాదాద్రి భువనగిరి 12 శాతం
ములుగు 12శాతం
పెద్దపల్లి 11శాతం
సిద్దిపేట 13 శాతం
వికారాబాద్ 13 శాతం
రాజన్న సిరిసిల్ల 12 శాతం
అసిఫాబాద్ 12శాతం
సూర్యాపేట 12శాతం
భూపాలపల్లి 13 శాతం
భద్రాద్రి కొత్తగూడెం 14శాతం
జనగామ 13శాతం
గద్వాల 11శాతం
జగిత్యాల 11శాతం
హైదరాబాద్ 8శాతం
వనపర్తి 10శాతం
ఆదిలాబాద్ 11శాతం
మహబూబాబాద్ 11 శాతం
మంచిర్యాల 11శాతం
మేడ్చల్ 10 శాతం
మహబూబ్నగర్ 12 శాతం
మెదక్ 13శాతం
నల్గొండ 10శాతం
నిర్మల్  11శాతం
నాగర్ కర్నూల్ 12శాతం
నిజామాబాద్ 12 శాతం
పెద్దపల్లి 11శాతం
రంగారెడ్డి 10శాతం
సంగారెడ్డి 12శాతం
సిద్దిపేట 13 శాతంగా  పోలింగ్ నమోదయింది.

పోలీసులు లాఠీఛార్జ్‌ 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో ఘర్షణ చేటు చేసుకుంది.  ఓవైపు పోలింగ్‌ జరుగుతుండగా.. రెండు పార్టీలకు చెందిన మద్దతుదారులు ఘర్షణకు దిగారు.  పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. భద్రాద్రి జిల్లా నల్లబండబోడుకు తారు రోడ్డు వేయలేదని గ్రామస్థులు ఓటు వేయకుండా నిరసన తెలిపారు. జనగామ జిల్లా 245వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, సీపీఐ, బిజిపి కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకొని వాళ్లను చెదరగొట్టారు.

  •  ఉదయం 9 గంటలకు 8.38శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
  • ఎల్లారెడ్డిలో 11.2శాతం, కామారెడ్డిలో 11శాతం, జుక్కల్ లో 7.43శాతం నమోదు అయినట్లు సమాచారం.

ఓటు హక్కును వినియోగించుకున్నసినీ ప్రముఖులు 

  •  బుధవారం 28మంది వ్యాపారులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు వారిని గురువారం విడుదల చేశారు.
  • పలు ఈవిఎం లు మొరాయించడంతో కొంత ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది.

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బంజారాహిల్స్ లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే బిఆర్.ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు కొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనేక మంది సినీ తారలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు వినియోగించుకునేందుకు వరుసలో నిలబడి ఉన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ చేశారు. ఒక్కో బూత్‌లో 50 ఓట్లతో మాక్ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటు వేసేందుకు 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూండా రాష్ట్ర పోలీసులతో పాటుపారామిలటరీ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆదిలాబాద్జి జిల్లా కేంద్రంలో డైట్ కళాశాలలో 262, 261, 263 పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అక్కడ పోలింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపి మిడియం బాబురావు
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపి మిడియం బాబురావు
➡️