అమరావతి : ” అవినీతి చక్రవర్తి జగన్.. ఇక 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో ” అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. శనివారం లోకేశ్ ట్వీట్ చేస్తూ … సిఎం జగన్‌పై విమర్శలు సంధించారు. జగన్.. దొంగ సొమ్ముతో వ్యవస్థల్ని ఇంకెంత కాలం మేనేజ్ చేస్తారని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా కేసులు మేనేజ్ చేస్తూ వచ్చారని ట్వీట్ చేశారు. ” ఇప్పుడు కోర్టు నోటీసులతో జగన్ అండ్ కో పని అయిపోయింది. అవినీతి చక్రవర్తి జగన్.. ఇక 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలి ” అని పేర్కొన్నారు.