ప్రజాశక్తి-సింహాచలం : నష్టపరిహారం ఇవ్వకుండా తమ ఇళ్లను తొలగించవద్దంటూ బాధితులు ఆందోళన చేస్తున్నా అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా సింహాచలంలో చోటుచేసుకుంది. సింహాచలం తొలి పావంచా నుంచి అడవివరం వరకు బిఆర్.టిఎస్ పనులు ప్రారంభించేందుకు జీవీఎంసీ అధికారులు తరలివచ్చారు. తమకు ఎటువంటి నష్టపరిహారం, టిడిఆర్లు చెల్లించకుండా పనులు ప్రారంభించవద్దని స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డగించారు. అయినా పనులు ప్రారంభించడంతో స్థానిక ప్రజాప్రతిని అడ్డగించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో బాధితులు అధికారులు తీరును దుయ్యబట్టారు. ఈ తొలగింపు కార్యక్రమంలో ఎల్ల కోల్పోయిన నిర్వాసితులు ఆహాకారాల రోదనలతో నిండిపోయింది. తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఇల్లు తొలగించడంతో నడిరోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు కార్పొరేటర్ లు పీవీ నరసింహులు, బెహరా భాస్కరరావు, టిడిపి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం కార్యదర్శి పాసర్ల ప్రసాద్, తెలుగు యువత అధికార ప్రతినిధి సత్తివాడ శంకర్రావు, జనసేన భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సందీప్, 98వ వార్డు టిడిపి అధ్యక్షులు పంచదార శ్రీనివాసరావు అడివరం సహకార పరపతి సంఘం అధ్యక్షులు కర్రీ అప్పలస్వామిలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.