ఎసిబి వలలో ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌- విదేశీ విద్య స్కాలర్‌ షిప్‌కు రూ.40 వేలు లంచం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధివిదేశీ విద్య పథకం స్కాలర్‌షిప్‌ మంజూరు కోసం ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఆర్ధిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ ఒంటెద్దు నాగభూషణరెడ్డిని శుక్రవారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన మహమ్మద్‌ నదీమ్‌ హుస్సేన్‌ తన చిన్నకుమారుడు అజంతుల్లా షరీఫ్‌కు విదేశీ విద్య స్కాలర్‌షిప్‌ మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్‌ చేయడానికి ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ నాగభూషణరెడ్డిని సంప్రదించారు. అందుకు రూ.40 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో హుస్సేన్‌ ఎసిబి అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌ నుంచి నాగభూషణరెడ్డి నగదు తీసుకొని ఫ్యాంటు జేబులో పెట్టుకోగా ఎసిబి అధికారులు దాడి చేశారు. బాధితుడి నుంచి తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

➡️