హైదరాబాద్ : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశారు. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు.. గూగుల్‌కు అతుక్కుపోయారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పడంతో.. అనుకున్నట్లుగానే ప్రముఖ సర్వే సంస్థలు కొన్ని మీడియా మీట్‌లు పెట్టి.. మరికొన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే.. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చేశాయి.
తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :
ఆరా
బీఆర్‌ఎస్ : 41-49
కాంగ్రెస్ : 58-67
బీజేపీ : 5-7
ఇతరులు : 7-9
పల్స్ టుడే
బీఆర్‌ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
చాణక్య స్ట్రాటజీస్
బీఆర్‌ఎస్ : 22-30
కాంగ్రెస్ : 67-78
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00 12
సీఎన్‌ఎన్ న్యూస్-18
బీఆర్‌ఎస్ : 48
కాంగ్రెస్ : 56
బీజేపీ : 10
ఎంఐఎం : 05
ఇతరులు : 00