బంగాళాఖాతంలో మిధిలీ తుపాను – చేపల వేటకు వెళ్లద్దని హెచ్చరిక

Nov 18,2023 11:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మిధిలీగా నామకరణం చేసిన ఈ తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా వుంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లద్దని వాతావరణశాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఒడిశాలోని పరదీప్‌నకు 190 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయం బంగ్లాదేశ్‌లో తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్‌తోపాటు భారత తీరప్రాంతం అంతటా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

తాజా వార్తలు

➡️