సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్‌

Nov 24,2023 15:26 #dulipalla naredra, #press meet

అమరావతి: హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు అక్కడ సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారు. దాని బకాయిలు అడిగేందుకు వారు ఇటీవల చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని, బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చేబ్రోలు సీఐ తెలిపారు. ఈకేసులో 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. విచారణ చేపట్టిన హైకోర్టు ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

➡️