ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం వెలివోలులో మంగళవారం వసుమతి (90) వయోభారంతో స్వగృహంలో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని సిపిఎం నేతలు మహమ్మద్ కరీముల్లా, కుంపటి బాబురావు, కుంపటి బేబీ సరోజిని బుధవారం సందర్శించి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. భూ పోరాట యోధుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కోగంటి రాఘవయ్య భార్య వసుమతి చల్లపల్లి జమిందార్ పెత్తందార్ల విధానాలపై వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధులకు పరోక్షంగా సహకారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమె భర్త గతంలో చనిపోయారు. ఆమెకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. బుధవారం బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పశు వైద్యాధికారి అన్నే బాబురావు. విశ్రాంత ఎంపీడీవో ఏ ఆర్. కె.ప్రసాద్, మాలెంపాటి రంగారావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.