హైదరాబాద్ : ” బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించవద్దని కోరాం. సంజయ్ ను తొలగించడంతో బిజెపి పరువు పోయింది ” అని విజయశాంతి ధ్వజమెత్తారు. శనివారం గాంధీభవన్‌లో సినీనటి విజయశాంతి మాట్లాడుతూ … మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. కెసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బిజెపి చెబితే ఆ పార్టీలోకి వెళ్లానని అన్నారు. ఏళ్లు గడచినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆధారాలు ఉండి కూడా బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదు ? అని ప్రశ్నించారు. బిజెపి, బిఆర్‌ఎస్ రెండూ ఒక్కటేననీ.. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించవద్దని కోరామనీ.. సంజరును తొలగించడంతో బిజెపి పరువు పోయిందని విజయశాంతి దుయ్యబట్టారు.