పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగిత రేటు : సర్వే

న్యూఢిల్లీ :   దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గినట్లు ఓ సర్వే తెలిపింది. గతేడాది జులై -సెప్టెంబర్‌లో 7.2 శాతం ఉండగా, 2023 జులై -సెప్టెంబర్‌లో 6.6 శాతానికి తగ్గినట్లు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) వెల్లడించింది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీసర్స్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) చేపట్టిన ఈ సర్వే వివరాలను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.

15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లో.. నిరుద్యోగిత రేటు 6.6 శాతం ఉండగా, పురుషుల కేటగిరీ 6 శాతం ఉంది. మహిళల కేటగిరీలో గతేడాది జులై-సెప్టెంబర్‌లో 9.4 శాతం ఉండగా, 2023లో 8.6 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో మొత్తం జనాభాలో కార్మికుల జనాభా నిష్పత్తి (జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతం) గతేడాదితో పోలిస్తే పెరిగినట్లు సర్వే పేర్కొంది. గతేడాది జులై -సెప్టెంబర్‌లో 44.5 శాతం ఉండగా, 2023 జులై -సెప్టెంబర్‌లో 46 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో పురుషుల కేటగిరీలో 68.6 శాతం నుండి 69.4 శాతానికి పెరిగింది. మహిళల కేటగిరీలో 19.7 శాతం నుండి 21.9 శాతానికి పెరిగింది.

➡️