మహువా మొయిత్రా బహిష్కరణ వేటుపై స్పందించిన మమతా బెనర్జీ 

కోల్‌కతా : ఎట్టకేలకు టిఎంసి ఎంపి మహువా మొయిత్రా బహిష్కరణ వేటుపై ఆ పార్టీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  మౌనం వీడారు.  మహువా మొయిత్రాకు మద్దతుగా ఆమె గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. లోక్‌సభ నుండి మహువా మొయిత్రాను బహిష్కరించాలని  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యోచిస్తోందని,  కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇది ఆమెకు సహాయం చేస్తుందని అన్నారు.  మహువా మొయిత్రా పార్లమెంటులో అదానీ గురించి ప్రశ్నలు అడిగేందుకు మరో వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుండి రూ. 2 కోట్ల లంచం మరియు విలాసవంతమైన వస్తువులను తీసుకున్నారని బిజెపి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఆరోపణలపై మమతా బెనర్జీ స్పందించలేదు.

➡️