హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కార్మిక శాఖ పోలింగ్ తేదీ నవంబర్ 30వ తేదీన వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఫ్యాక్టరీలు, సంస్థల చట్టం-1974, తెలంగాణ షాప్ కాంప్లెక్స్ చట్టం-1988 నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఐ.రాణి కుముదిని జారీ చేశారు.