అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

Nov 27,2023 17:32 #Imran Khan, #Pakistan

ఇస్లామాబాద్‌ :  అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి సోమవారం పాకిస్థాన్‌ అకౌంటిబిలిటీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.ఆయన పోలీస్‌ కస్టడీని పొడిగించాలన్న నేషనల్‌ అకౌంట్‌బిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. పాకిస్థాన్‌ అకౌంటిబిలిటీ కోర్టు జడ్జి ముహమ్మద్‌ బషీర్‌ నేతృత్వంలో రావల్పిండిలోని అడియాలా జైలులో అల్‌ ఖాదిర్‌ ట్రస్ట్‌ అవినీతి కేసు విచారణ జరిగింది. వేర్వేరు కేసులలో సెప్టెంబర్‌ 26 నుండి పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రస్తుతం అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్‌ఖాన్‌ సోదరీ మణులు అలీమా ఖానూమ్‌, నొరీన్‌ ఖానూమ్‌లతోపాటు ఆయన భార్య బుష్రా బీబిలు కూడా విచారణకు హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవినీతి కేసులో నవంబర్‌ 15 నుండి అడియాలా జైలులో ఇమ్రాన్‌ఖాన్‌ను ఎన్‌ఎబి విచారిస్తోంది. ఆదివారం కూడా సుమారు రెండు గంటల పాటు విచారించినట్లు ఎన్‌ఎబి సీనియర్‌ అధికారి ఒకరు స్థానిక పత్రికకు తెలిపారు.

➡️