9న డబ్ల్యుపిఎల్‌ వేలంమహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలం, వాల్యూ పెంపు: బిసిసిఐ

Nov 24,2023 22:05 #Sports

ముంబయి: 2024 సీజన్‌కు సంబంధించి మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) వేలం తేదీని బిసిసిఐ వెల్లడించింది. డిల‌సెంబర్‌ 09న ముంబయి వేదికగా డబ్ల్యుపిఎల్‌ వేలం జరుగుతుందని, అలాగే ఫ్రాంచైజీల వాల్యూను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌ విజయవంతమైన నేపథ్యంలో రెండో సీజన్‌ను మరింత ఆసక్తిగా మార్చేందుకు గాను బిసిసిఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈసారి డబ్ల్యుపిఎల్‌ను బెంగళూరు, ముంబయి వేదికలుగా నిర్వహించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేగాక గతేడాది రూ.12 కోట్లుగా ఉన్న ఒక్కో ఫ్రాంచైజీ పర్స్‌ వాల్యూను ఈ ఏడాది రూ. 13.5 కోట్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.1.5 కోట్లు అధికం. డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ఇదివరకే తాము రిటైన్‌, రిలీజ్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం విదితమే. ఐదు ఫ్రాంచైజీలు గత సీజన్‌లో తమతో ఆడిన 60 మంది క్రికెటర్లను రిటైన్‌ చేసుకుని 29 మంది విడుదల చేశాయి. రిటైన్‌ చేసుకున్నవారిలో 21 మంది విదేశీ క్రికెటర్లున్నారు. రిటైన్‌, రిలీజ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్‌ వాల్యూ వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్‌ : రూ. 2.25 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ : 3గుజరాత్‌ జెయింట్స్‌ : రూ. 5.95 కోట్లు, స్లాట్స్‌: 10ముంబై ఇండియన్స్‌ : రూ. 2.1 కోట్లు, స్లాట్స్‌: 5రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు : రూ. 3.35 కోట్లు, స్లాట్స్‌: 7యూపీ వారియర్స్‌ : రూ. 4 కోట్లు, స్లాట్స్‌: 5ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను (9 స్లాట్స్‌ విదేశీ క్రికెటర్లకు) దక్కించుకునేందుకు రూ. 71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి.

➡️