రాత్రి 7.00గం||ల నుంచి
విశాఖపట్నం: ఐసిసి వన్డే ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో టి20 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన సూర్యకుమార్, ఇషాన్ మినహా.. మిగిలిన క్రికెటర్లందరూ విశ్రాంతి కోరుకోవడంతో యువ క్రికెటర్లతో ఆసీస్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక మిస్టర్ 360 డిగ్రీస్‌కు తొలిసారి భారత పగ్గాలు దక్కాయి. ప్రపంచకప్‌లో నిరాశపరిచిన సూర్యకుమార్‌తో పాటు ఒక్క మ్యాచ్‌లోనూ చోటు దక్కని ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరమెంతైనా ఉంది. మరోవైపు యువ క్రికెటర్లు జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, బిష్ణోరు తదితర ఆటగాళ్లకు ఈ సిరీస్ ఓ సవాలుతో కూడుకున్నది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్‌ను నెగ్గిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ కమిన్స్, స్టార్క్, లబూషేన్, వార్నర్, మార్ష్ వన్డే ప్రపంచకప్ ముగిసాయ స్వదేశానికి తిరిగి వెళ్లారు. మిగిలిన ఆటగాళ్ళతో ఆ జట్టు టి20 సిరీస్‌కు సిద్ధమౌతోంది. ఇక ఆసీస్ సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ మాధ్యూ హెడ్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరుజట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి టి20 విశాఖపట్నంలోని ఎసిఏ-విడిసిఏ క్రికెట్ అకాడమీలో జరగనుంది.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు హార్దిక్ దూరం
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్.. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లోనే తిరిగి బ్యాట్ పట్టనున్నట్లు సమాచారం. భారత జట్టు ఆసీస్‌తో టి20 సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత జనవరిలో స్వదేశంలో అఫ్గాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుండగా.. ఆ సిరీస్‌లకు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది సందేహాస్పదమే. పాండ్యాకు మరింత విశ్రాంతి అవసరమని, వచ్చే ఏడాది జూన్‌లో భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాండ్యాను మధ్యలో ఆడించి గాయాన్ని పెద్దది చేసేదానికంటే ప్రస్తుతానికి అతడికి విరామమిచ్చిందే బెటర్ అన్న యోచనలో బిసిసిఐ ఉన్నట్టు తెలుస్తోంది.
జట్లు:
భారత్: సూర్యకుమార్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్, జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, బిష్ణోరు, ఆర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, గైక్వాడ్, జితేశ్ శర్మ.
ఆస్ట్రేలియా: మాధ్యూ వేడ్(కెప్టెన్, వికెట్ కీపర్), హెడ్, షార్ట్, స్మిత్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, స్టొయినీస్, టిమ్ డేవిడ్, అబట్, జంపా, ఎల్లిస్, బెహ్రెన్ డార్ఫ్, సాంఘ్వా, జెన్సన్, హెర్డే.