- ద్రావిడ్ తో పాటు ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టు కూడా పొడిగింపు
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పొడిగించింది. దాంతో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా ద్రావిడే కోచ్ గా కొనసాగుతాడు. వాస్తవానికి కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్ తో ముగిసింది. మళ్లీ కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ సుముఖంగా లేడంటూ వార్తలు వచ్చాయి. అయితే, పలు సంప్రదింపుల అనంతరం కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడంతో బీసీసీఐ ప్రకటన చేసింది. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతాడని, ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టును కూడా పొడిగిస్తున్నామని బోర్డు వెల్లడించింది. ద్రావిడ్ తో చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలిపింది.