ఫైనల్లో ఆస్ట్రేలియాపై 2-0తో గెలుపు డేవిస్ కప్-2023 టైటిల్‌ను తొలిసారి ఇటలీ జట్టు సాధించింది. 1976నుంచి జరుగుతున్న డేవిస్ కప్ టోర్నీలో ఇటలీ జట్టు ఫైనల్లో 2-0తో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. తొలి సింగిల్స్‌లో జన్నిక్ సిన్నర్ 6-3, 6-0తో అలెక్స్-డి-మినర్‌ను చిత్తుచేయగా.. రెండో సింగిల్స్‌లో మట్టెయో అమల్డి 7-5, 2-6, 6-4తో అలెక్సీ పొపొరిన్‌పై సంచలన విజయం సాధించాడు. దీంతో ఇటలీ జట్టు తొలిసారి ఈ టోర్నమెంట్‌ను చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. అమల్దీ టోర్నమెంట్ ఆరంభం నుంచి సంచలన విజయాలతో ఇటలీ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్‌లో ఇటలీ జట్టు 2-1తో సెర్బియాను, ఆస్ట్రేలియా జట్టు 2-0తో ఫిన్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాయి. సెమీస్‌లో జెన్నిక్ సిన్నర్(ఇటలీ) 6-2, 2-6, 7-5తో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్‌ను చిత్తుచేసి సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే.