హాంగ్జౌ: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి టాప్‌సీడ్, భారత ద్వయం సాత్విక్‌ాచిరాగ్ శెట్టి దూసుకెళ్లారు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో చిరాగ్-సాత్విక్ 21-15, 22-20పాయింట్ల తేడాతో చైనాకు చెందిన హాేజిాటెంగ్-రెన్ షింగ్ యుపై వరుససెట్లలో గెలిచారు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన భారత ధ్వయం.. రెండో గేమ్‌లో ఓ దశలో 20ా20 పాయింట్లతో సమంగా నిలిచారు. ఆ తర్వాత భారత జంట వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను 22ా20తో ముగించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా రెండో గేమ్స్‌లో చిరాగ్‌ాసాత్విక్ అర్ధభాగం ముగిసేసరికి 9-11పాయింట్లతో వెనుకబడ్డా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని మ్యాచ్‌ను ముగించడం విశేషం. చైనా షట్లర్ల మధ్య జరిగే మరో సెమీస్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత జోడీ టైటిల్‌కై తలపడనుంది.