స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్‌ కుదేల్‌..

Dec 2,2023 10:08 #Sports
  • నాల్గో టి20లో 20పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా
  • సిరీస్‌ 3-1తో కైవసం

రాయపూర్‌ : స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కి తోడు రవి బిష్ణోరు బౌలింగ్‌లో రాణించడంతో భారతజట్టు 20పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. భారత్‌ నిర్దేశించిన 175పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్ల నష్టానికి 154పరుగులే చేయగల్గింది. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌(3/16), బిష్ణోరు(1/17) పొదుపు గా బౌలింగ్‌ చేసి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. తొలుత రింకు సింగ్‌(46), జైస్వాల్‌(37), గైక్వాడ్‌(32) బ్యాటింగ్‌లో రాణించడంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు, వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ 19 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సులతో 35 పరుగులు సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (1) నిరాశపరిచారు. 4వికెట్ల నష్టానికి 167పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఏడు పరుగుల వ్యత్యాసంలో ఐదు వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ బౌలర్లలో బెన్‌ డ్వార్ష్‌స్‌కు మూడు, బెహ్రెన్‌ డార్ఫ్‌, సంఘాకు రెండేసి, ఆరోన్‌ హార్డీకి ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 3ఓవర్లలోనే 40పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఆ దశలో స్పిన్నర్‌ రవి బిష్ణోరు… ఫిలిప్‌ను బౌల్డ్‌చేసి తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అక్షర్‌ రాణించడంతో ఆసీస్‌ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ మాధ్యూ వేడ్‌(36నాటౌట్‌), హెడ్‌(31) టాప్‌ స్కోరర్స్‌. అక్షర్‌కు మూడు, దీపక్‌ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అక్షర్‌ పటేల్‌కు దక్కగా… ఐదో, చివరి టి20 బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.

స్కోర్‌బోర్డు..

ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)డెర్మాట్‌ (బి)హార్డి 37, గైక్వాడ్‌ (సి)డ్వార్షూస్‌ (బి)సంఘా 32, శ్రేయస్‌ (సి)క్రిస్‌ గ్రీన్‌ (బి)సాంఘా 8, సూర్యకుమార్‌ (సి)వేడ్‌ (బి)డ్వార్షూస్‌ 1, రింకు సింగ్‌ (ఎల్‌బి)బెహ్రెన్‌డార్ష్‌స్‌ 46, జితేశ్‌ శర్మ (సి)హెడ్‌ (బి)డ్వార్షుస్‌ 35, అక్షర్‌ పటేల్‌ (సి)సంఘా (బి)డ్వార్షుస్‌ 0, దీపక్‌ చాహర్‌ (సి)క్రిస్‌ గ్రీన్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 0, రవి బిష్ణోరు (రనౌట్‌) ఫిలిప్స్‌/హెడ్‌ 4, ఆవేశ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 1, అదనం 10. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 174పరుగులు. వికెట్ల పతనం: 1/50, 2/62, 3/63, 4/111, 5/167, 6/168, 7/168, 8/169, 9/174 బౌలింగ్‌: హార్డి 3-1-20-1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4-0-32-2, డ్వార్షుస్‌ 4-0-40-3, క్రిస్‌ గ్రీన్‌ 4-0-36-0, సాంఘ్వా 4-0-30-2, షార్ట్‌ 1-0-10-0.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) ముఖేశ్‌ (బి)అక్షర్‌ 31, ఫిలిప్స్‌ (సి)బిష్ణోరు 8, డెర్మాట్‌ (బి)అక్షర్‌ 19, హార్డీ (బి)అక్షర్‌ 8, టిమ్‌ డేవిడ్‌ (సి)జైస్వాల్‌ (బి)దీపక్‌ చాహర్‌ 19, షార్ట్‌ (సి)జైస్వాల్‌ (బి)చాహర్‌ 22, వేడ్‌ (నాటౌట్‌) 35, డ్వార్ష్‌స్‌ (బి)ఆవేశ్‌ ఖాన్‌ 1, క్రిస్‌ గ్రీన్‌ (నాటౌట్‌) 2, అదనం 8, (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 154పరుగులు.వికెట్ల పతనం: 1/40, 2/44, 3/52, 4/87, 5/107, 6/126, 7/133 బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-44-2, ముఖేశ్‌ కుమార్‌ 4-0-42-0, రవి బిష్ణోరు 4-0-17-1, అక్షర్‌ పటేల్‌ 4-0-16-3, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-33-1.

రుతురాజ్‌ రికార్డు…

రుతురాజ్‌ గైక్వాడ్‌మరో రికార్డు నెలకొల్పాడు. టి20ల్లో వేగంగా 4వేల పరుగుల కొట్టిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే టి20ల్లో వేగంగా 4 వేల పరుగులు కొట్టిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. రారుచూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాల్గో టి20లో గైక్వాడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. గైక్వాడ్‌ 116 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల పరుగులు పూర్తిచేశాడు. దాంతో కేఎల్‌ రాహుల్‌ (117 ఇన్నింగ్స్‌లు) రికార్డు బద్ధలైంది. ఈ ఫార్మాట్‌లో వేగంగా 4వేల పరుగులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో క్రిస్‌ గేల్‌(107 ఇన్నింగ్స్‌) ముందున్నాడు. ఆ తర్వాత షాన్‌ మార్ష్‌(113 ఇన్నింగ్స్‌), బాబర్‌ ఆజాం(115 ఇన్నింగ్స్‌), డెవాన్‌ కాన్వే(116 ఇన్నింగ్స్‌) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

తాజా వార్తలు

➡️