సెమీస్‌కు చిరాగ్‌-సాత్విక్‌ జంటచైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

Nov 24,2023 22:10 #Sports

హాంగ్జౌ: చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌శెట్టి జోడి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో చిరాగ్‌-సాత్విక్‌ జోడీ 21-16, 21-14తో ఇండోనేషియాకు చెందిన లియోాకర్నాండోలపై సునాయాసంగా నెగ్గారు. ఈ మ్యాచ్‌ను భారత జంట కేవలం 46నిమిషాల్లోనే ముగించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌కు చేరిన ఏకైక షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణరు రారు జపాన్‌కు చెందిన కొడారు నరోకా చేతిలో వరుససెట్లలో ఓడాడు. క్వార్టర్స్‌లో ప్రణయ్ 9-21, 14-21తో పరాజయాన్ని చవిచూశాడు. శనివారం జరిగే సెమీస్‌లో సాత్విక్‌ాచిరాగ్‌ జోడీ ఇండోనేషియాకే చెందిన హిాజోటి, రెన్‌ ఎక్యూతో తలపడనున్నారు.

➡️