కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శనతో ఆ దేశ క్రికెట్‌బోర్డు అనూహ్య మార్పులకు తెరలేపింది. వన్డే, టెస్ట్‌లకు కొత్త కెప్టెన్లను ఎంపిక చేసిన పాక్ బోర్డు.. తాజాగా బౌలింగ్ కోచ్‌లు మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, సయీద్ అజ్మలను ఎంపిక చేసింది. పేస్ విభాగానికి ఉమగర్ గుల్, స్మిన్ విభానికి సయీద్ అజ్మద్ కోచ్‌లు వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది. అలాగే టీమ్ డైరెక్టర్‌గా మహ్మద్ హపీజ్ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఐసిసి వన్డే బౌలర్ల జాబితాలో గతంలో అగ్రస్థానంలో కొనసాగిన అజ్మల్ ఆ దేశ పురుషుల జట్టు స్పిన్ విభాగాన్ని పటిష్టం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాడని పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.