నజ్ముల్‌ సెంచరీ

Nov 30,2023 22:25 #Sports

భారీ ఆధిక్యత దిశగా బంగ్లాదేశ్‌

న్యూజిలాండ్‌తో తొలిటెస్ట్‌

చిట్టోగ్రామ్‌(బంగ్లాదేశ్‌): న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు 317పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆ జట్టుకు 7పరుగుల స్వల్ప ఆధిక్యత లభించింది. గురువారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మహ్ముదల్‌ హసన్‌ జారు(8) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. మరో ఓపెనర్‌ జకీర్‌ హసన్‌(17) అజాజ్‌ పటేల్‌ వేసిన 14వ ఓవర్లో ఎల్బీగా నిష్క్రమించాడు. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాను శాంతో, మోమినుల్‌ హక్‌(40) ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మోమినుల్‌.. రనౌట్‌ కావడంతో ఆ జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. మోమినుల్‌ నిష్క్రమించినా.. ముష్ఫీకర్‌ రహీమ్‌తో కలిసి శాంతో బంగ్లా ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టుకు ఇప్పటికే 205 పరుగుల ఆధిక్యత లభించింది. కెప్టెన్‌ నజ్ముల్‌ హొసైన్‌ శాంతో(104నాటౌట్‌, 10 ఫోర్లు) శతకంతో మెరిసాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 8వికెట్ల నష్టానికి 266 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ జట్టు జెమీసన్‌ (23)తో పాటు కెప్టెన్‌ టిమ్‌ సౌథీ(35) రాణించడంతో ఆధిక్యతను సంపాదించింది.

➡️